ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బస్సు డిపోల ముందు బీఆర్‌ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిద్దిపేట పాత బస్టాంట్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మోదీ కేడీ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు..ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.






















Discussion about this post