కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగానే ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
Discussion about this post