రాష్ట్రంలో అన్నీ స్థానాలకు బీఎస్పీ పార్టీ పోటీ చేస్తుందన్నారు బీఎస్పీ రాష్ట్ర నాయకులు పరంజ్యోతి అన్నారు. రాయలసీమలో కుట్ర రాజకీయాలను ఎండగట్టే విధంగా ముందుకొచ్చిన ఔత్సాహికుల నుంచి అభ్యర్థుల ఎంపిక సాగించామన్నారు. ఈ ఎన్నికలలో ఏపార్టీతో పొత్తులేకుండా సామాజిక తోడ్పాటుతోనే పోరాటం సాగుతోందన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు రాష్ట్ర పరంజ్యోతి వివరించారు. తిరుపతిలో రెండో విడత బీఎస్పీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. వీరికి ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పరంజ్యోతి తెలిపారు.
Discussion about this post