మాల్దీవులు : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకు ఆర్థిక సహాయంగా రూ.600 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. బడ్జెట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖకు 22,154 కోట్లు కేటాయించారు.మన దేశ ‘పొరుగు మొదటి ప్రాధాన్యత’ విధానంలో భాగంగా సరిహద్దు దేశం భూటాన్ అభివృద్ధికి రూ.2,068 కోట్లు, మాల్దీవులకు రూ.600 కోట్లు, నేపాల్‌కు రూ.700 కోట్లు, ఆఫ్ఘనిస్థాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు. ఇరాన్‌కు సంబంధించిన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం.. ఆ దేశంలోని చబహార్ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లు ప్రకటించింది. మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు ఉన్న సమయంలో కూడా ఆ దేశానికి చేయూతనిచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపడం విశేషం.
Discussion about this post