ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మార్చి 11న జీవన్ రెడ్డి, నవీన్ రెడ్డిలు నామినేషన్లు వేయనున్నారు. మొత్తం ఓటర్లు 1,445 మంది ఉండగా, బీఆర్ఎస్ నుంచి 850 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు సవాల్ గా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేయాలని చూస్తోంది. బీఆర్ ఎస్ తమ పార్టీ అభ్యర్థులను మిగతా పార్టీల్లోకి వెళ్ల కుండా ఉండేందుకు తమ వంతు గట్టి ప్రయత్నం చేస్తూ ..సామ, దాన బేద, దండోపాయాలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అవసరమైతే కొన్ని చోట్ల క్యాంపు రాజకీయాలకు కూడా సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ కూడా తమ సభ్యులను 15 రోజులు క్యాంపులకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Discussion about this post