కేన్ జాతి మొక్కలు భారత్ లో అరుదైన మొక్కలుగా ఉన్నాయి. తెలంగాణలో ములుగు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో సుమారు 43 ఎకరాల కేన్ రక్షిత ప్రాంతం ఆరు దశాబ్దాల నుండి ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాధుడు లేడు. .
ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న కేన్ రక్షిత ప్రాంతాన్నిరక్షించే చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు . ములుగు జిల్లాకి తలమానికంగా ఉన్న రామప్పకు దగ్గరగా పాలంపేట గ్రామ శివారులో 43 ఎకరాల కేన్ ప్రాంతం 1974 లోనే రక్షిత ప్రాంతంగా గుర్తించబడినప్పటికీ స్థానిక అధికారుల అలసత్వం దాని నాశనానికి కారణమవుతోంది. గత 20 సంవత్సరాల నుండి 54 ఎకరాల నుండి ఐదు ఎకరాలకు చించకపోయిన కేన్ రక్షిత ప్రాంతం భూ సర్వే ఆధారంగా 43 ఎకరాలుగా 2014లో అప్పటి డిఎఫ్ఓ లింగారావు, సబ్ డిఎఫ్ఓ ఆంజనేయులు రెవెన్యూ అధికారుల సహాయంతో కందకం ఏర్పాటు చేయటం జరిగింది. క్రమేపి కందకాలు ధ్వంసం చేసి ఆక్రమిస్తున్నా ఏ ఒక్క అధికారి దానిని గమనించ పోవడం, ఆపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రక్షణ ప్రాంతాన్ని విధ్వంసం చేస్తున్న వారిని వెంటనే గుర్తించి, వారిపై వెంటనే బయోడైవర్సిటీ ఆక్ట్ కింద క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Discussion about this post