నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెంలో నిలిపి ఉన్న కారు అద్దం పగలగొట్టి రూ.2 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకున్నది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం .. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన గౌరు శ్రీనివాస్..వేములపల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో రూ 2 లక్షలు డ్రా చేసుకున్నాడు. డబ్బులు కారులో పెట్టి, తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. గుర్తుతెలియని దుండగులు డ్రైవర్ వైపు గల అద్దం పగలగొట్టి కారులోని నగదు ఎత్తుకెళ్లారు. 5 నిమిషాల్లో కారు వద్దకు చేరుకున్న బాధితులు చోరీ జరిగిన విషయం గమనించి టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చుట్టుపక్కల సీసీ పుటేజీ పరిశీలించి విచారణ చేపట్టారు.
Discussion about this post