ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాల్సిందేనని పెందుర్తి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకురాలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజ అన్నారు. పెందుర్తి తాసిల్దార్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… షెడ్యూల్ విడుదలైన తర్వాత సబ్బవరంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించినందున ఆ పార్టీపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పెందుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ నిర్వహణకు అనుమతి తీసుకున్నప్పటికీ, మైక్ సిస్టం వినియోగించడంతో ఆ పార్టీ పైన కేసు నమోదు చేశామని అన్నారు. రోడ్డుపై ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని, విగ్రహాలకు ముసుగులు వేస్తున్నామని చెప్పారు.























Discussion about this post