విమానం కనిపెట్టిన రైట్ సోదరుల సక్సెస్ లో వారి సోదరి కేథరిన్ ది కీలక పాత్ర. ఆమె సోదరుల విజయాన్ని ప్రపంచం ముందుకు తీసుకు వెళ్లడం, రికార్డుల్లోకి ఎక్కించడంలో ఆమె కృషి ఎంతో ఉంది. శతాబ్ద కాలం తర్వాత బరువైన ఎయిర్ క్రాఫ్ట్ లుగా రూపాంతరం చెందేవరకు విల్బర్, ఒర్విల్లే రైట్ ల పేర్లు అంతగా ప్రాచుర్యం పొందలేదు. చరిత్ర పుస్తకాల్లో రాసినట్లు నార్త్ కరోలినా లోని కిట్టీహాక్ సముద్ర తీరం ఇసుకలో వారు తయారు చేసిన గ్లైడ్ లో ఎగరడం ప్రాక్టీసు చేయడమే కాదు. ఏరోనాటిక్స్ ను కొత్త పుంతలు తొక్కించడానికి వారు బాటలు వేశారన్న విషయాన్ని ప్రపంచం గుర్తించాలి.
అప్పట్లో పక్షిలా ఎగిరే ఆవిష్కరణ అనివార్యమైంది. మొట్టమొదట రైట్స్ బ్రదర్స్ 12 సెకండ్లు ఫ్లయిట్ నడిపి రికార్డు సృష్టించారు. అయితే దానిని మరింత అభివృద్ది చేయడానికి దశాబ్దాలు పట్టింది. వారికున్న నైపుణ్యాలను బయటకు తీసుకురావడంలో కేథరిన్ కృషి అమోఘం. 1874లో డేటన్ లోని ఓహియాలో బిషప్ మిల్టన్ రైట్, సుసేన్ కోయినెర్ రైట్ లకు చివరి సంతానంగా కేథరిన్ పుట్టింది. తనకు 15 ఏళ్ల వయస్సులో ఉండగానే తల్లి టీబీతో మరణించింది. దీంతో ఇల్లు చక్కదిద్దుకునే బాధ్యత ఆమెపై పడింది. తండ్రికి సంబంధించి లెటర్లు రాసే పనుల్లో కూడా ఆమె సహకరించేది. అప్పటికి కేథరిన్ కంటే ఏడు, మూడు ఏళ్లు పెద్దవారైన విల్బర్, ఒరువిల్లే రైట్ లు గ్లైడర్ ను కనుక్కోలేదు. ఆ సమయంలో వారు ప్రింటింగ్ బిజినెస్ నడిపారు. 1892లో వారు ఒక సైకిల్ షాపు తెరిచారు.
రైట్ బ్రదర్స్ లోని ముగ్గురు అన్నదమ్ములు చక్కటి అనుబంధంతో ఉండేవారు. కష్టసుఖాలతోపాటు తల్లిని కోల్పోయిన బాధను కూడా పంచుకునే వారు. కేథరిన్ విషయానికి వస్తే ఇంటిపనులన్నీ చక్కదిద్దుకోవడమే కాకుండా చదువులో కూడా ముందుండేవారు. దీంతో ఆమె అన్నల్లా కాకుండా, కాలేజీ చదువులకు కూడా వెళ్లగలిగారు. 1898లో ఓబర్లిన్ కాలేజ్ నుంచి డిగ్రీ సాధించింది. ఆపై హైస్కూల్ లో ఇంగ్లీషు,లాటినో బోధించే టీచర్ గా ఆమె చేరారు. అయినప్పటికి తండ్రికి, సోదరుల పనుల్లో ఆమె చేదోడు వాదోడుగా ఉండేదని రైట్ బ్రదర్స్ నేషనల్ మ్యూజియం వైస్ ప్రసిడెంట్ అలెక్స్ హెక్ మెన్ చెప్పారు. గాలిలో పక్షిలా ఎగరాలన్న ఆమె సోదరుల ఆకాంక్షను ఆమె నిరంతరం ప్రోత్సహించేది. వాళ్లుకూడా సైకిల్ షాపు నడుపుతూనే బీచ్ లో గ్లైడ్ ను ఎగురవేయడం ప్రాక్టీసు చేసే వారు. బ్యాచిలర్లుగా ఉండిపోయిన రైట్ బ్రదర్స్ కు వారి కలలను సాకారం చేసుకునేందుకు కేథరిన్ ఎంతగానో సహకరించింది.
రైట్ బ్రదర్స్ 1900 లో ప్లైయింగ్ మెషిన్ ను కనుగొన్నారు. అదే ఏడాది సమ్మర్ లో మళ్లీ ప్రయోగాలు ప్రారంభించారు. వారి ప్రయోగాల సారాంశాన్ని 1901లో రెండు సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురించారు. దీంతో చికాగోలోని వెస్ట్రన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్లు వారిని ఆహ్వానించి, వారి పరిశోధనలపై ప్రసంగించాల్సిందిగా కోరారు. అయితే విల్బర్ రైట్ బహిరంగ సభల్లో మాట్లాడటం తనకు ఇబ్బందిగా ఉంటుందని అక్కడికి వెళ్లటానికి అంగీకరించలేదు. కేథరిన్ తన అన్నకు మంచి సూట్ కుట్టించి అందంగా తయారు చేసి, అక్కడికి వెళ్లేలా చేసింది. దీనిపై ఆమె తన తండ్రికి లేఖ రాస్తూ అన్న ఇంజనీర్ల సమావేశంలో ప్రసంగిస్తే తప్పకుండా శాస్త్రవేత్తలుగా గుర్తించబడతారని, వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని లేఖ కూడా రాసింది. ఆపై రెండేళ్లకు రైట్ సోదరులు వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఆ రోజు ఆమె ప్రోత్సాహం లేకుండా ఈ రోజు ప్రపంచానికి రైట్ బ్రదర్స్ తెలిసే వారేకాదు. ఆనాటి వారి ప్రసంగమే ఈనాడు వైమానిక శాస్త్రానికి పునాదులు వేసిందని రైట్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాట్రిక్ బి నోలన్ , రోనాల్డ్ గీబెర్ట్ 2002 లో రాసిన కిట్టీ హాక్ అండ్ బియాండ్ పుస్తకంలో రాశారు.
అనేక ఏళ్లపాటు కేథరిన్ టీచింగ్ లో కొనసాగినప్పటికీ , ఇంటిని చక్కదిద్దడంలో, తన సోదరుల ప్రయత్నాలను ప్రోత్సహించడంలోనూ వెనక్కి తగ్గలేదు.
1908 సెప్టెంబర్ 17న వర్జీనియాలో ఒర్విల్లే రైట్స్ నడిపిన విమానం ప్రమాదానికి గురైంది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అంతేకాకుండా దానిలో ప్రయాణిస్తున్నవారు మరణించారన్న వార్త తెలియంగానే.. ఆమె ఉద్యోగానికి సెలవు పెట్టి ఏడు వారాలపాటు ఆసుపత్రిలోని అన్నకు సపర్యలు చేసి, ఇంటికి తీసుకువచ్చింది. ఒర్విల్లే రైట్ అప్పటికింకా వీల్ చైర్ కే పరిమిత మయ్యాడు. విమాన ప్రయోగాల నేపథ్యంలో రైట్ బ్రదర్స్ ఫ్రాన్స్ వెళ్లాల్సి ఉండగా, వారితోపాటుగా ఆమె కూడా వెళ్లింది. ఆపై ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసి ఒర్విల్లే తో ప్రయాణాలను కొనసాగించింది. అలా యూరప్ అంతటా తన సోదరులను ప్రమోట్ చేయడంలో ఆమె భాగస్వామ్యం మరువలేనిది.
వాస్తవానికి రైట్ సోదరులిద్దరు ఇతరులతో కలుపుగోలుగా ఉండేవారు కాదు. అయితే చెల్లి కేథరిన్ మాత్రం అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి మాటతీరు, నడవడికతో ఆకట్టుకుని మంచి రిలేషన్లు కొనసాగించేందుకు సహకరించింది. అలాగే ప్రెస్ రిలేషన్లు కొనసాగించడంలో కూడా ఆమె దిట్ట. యూరప్ లో తన సోదరుల ప్రయోగాలను వారి లక్ష్యాలను తెలపడంలో ఆమె ప్రధాన పాత్ర వహించింది. కేథరిన్ ఆమె సోదరులకు ప్రమోటర్ , డిప్లొమేట్, అడ్వకేట్, హోస్టెస్ గా వ్యవహరించి తన అన్నలు మళ్లీ విమానం ప్రయోగంలో విజయం సాధిస్తారని ప్రమాదం జరిగిన 6 నెలల్లోనే ఢంకా బజాయించి మరీ తెలిపింది.
1909 జూన్ లో ప్రసిడెంట్ విలియం హౌవార్డ్ టాఫ్ట్ వాషింగ్టన్ లో వారికి ఏరో క్లబ్ మెడల్స్ ను అందించారు. 1901 నుంచి కేథరిన్ వారి అన్నలు చేసిన ప్రతిప్రయోగాన్ని రికార్డు చేసింది. అలాగే అమెరికా, యూరప్ లోని ఏరోనాటికల్ సంస్థలు, జర్నలిస్టులకు అనేక లేఖలు రాసింది. తన 45 ఏట 1912లో టైఫాయిడ్ మూలంగా విల్బర్ చనిపోయేంత వరకు ఆమె తన అన్నల కృషిని ఆవిష్కరిస్తూ అనేక సంస్థలతో ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించడంతోపాటు సోదరుల బయోగ్రఫీ, పేటెంట్ హక్కుల వివరాలను పొందుపరస్తూ రైట్ బ్రదర్స్ చరిత్రలో నిలిచిపోయేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. 1915 నుంచి 1942 వరకు ప్రయాణానికి అనువుగా ఉండే విమానాన్ని స్మిత్ సోనియన్ కనుగొనడంతో రైట్ బ్రదర్స్ కలలు సాకారమయ్యాయి. 1929 మార్చి 3న కేథరిన్ మరణించారు.
Discussion about this post