ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Delhi Rouse Avenue court) తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఢిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. కవితను రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయానికి అధికారులు తరలించారు. . నేటి నుంచే మూడు రోజుల పాటు కవితను సీబీఐ విచారించనుంది. లిక్కర్ కేసులో కవిత పాత్ర, వంద కోట్ల ముడుపుల వ్యవహారం, సౌత్ గ్రూప్, భూముల వ్యవహారంపై కవితను సీబీఐ ఎంక్వైరీ చేయనుంది.
Discussion about this post