పేదలకు ఇచ్చి దొంగపట్టాలు, మోసగిస్తూ పేదల పక్షాన ఉన్నానని పేర్ని నాని చెప్పడం హాస్యాస్పదమని కొల్లు రవీంద్ర అన్నారు. ఓటమి భయంతోనే ఆయన అవాకులు చవాకులు పేలుతున్నారని, ఇష్టారాజ్యంగా స్థలాలను కట్టబెడుతున్నారని చెప్పారు. ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని, అధికారంలోకి వచ్చాక వాటిపై సీబీఐ విచారణ జరిపిస్తామని అన్నారు. అవినీతిలో జగన్తో పేర్ని నాని పోటీపడుతున్నారని చెప్పారు.
Discussion about this post