కేటిఆర్ మేడిగడ్డ సందర్శన అనేది ఓ రాజకీయ డ్రామా అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసిఆర్ మేడిగడ్డను ఎన్నోసార్లు చూశాడనీ, కేటీఆర్ మేడిగడ్డ కుంగలేదని చెప్పాడన్నారు. మేడిగడ్డ సందర్శనతో బీఆర్ఎస్ సమస్యల్లో ఇరుక్కోవడమే తప్ప… నయా పైస లాభం లేదని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని…బండి సంజయ్ అసభ్యంగా మాట్లాడడం సభ్య సమాజం క్షమించదని, వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలన్నారు.
Discussion about this post