తాను ఏ తప్పూ చేయకపోయినప్పటికీ జైలులో పెట్టి.. క్షోభకు గురిచేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. మిచౌంగ్ తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించటానికి చంద్రబాబు శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు.
మిచౌంగ్ తుపానుతో రైతులు నష్టపోయారని, చేతికి పంట వచ్చే సమయంలో తుపాను దెబ్బ తీసిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని విమర్శించారు. తుపానుతో నష్టపోయిన ప్రాంతాల్లో కాకుండా సీఎం ఎక్కడో పర్యటిస్తున్నారని అన్నారు.
తుపాను కారణంగా రైతులు ఎకరాకు సుమారు 50 వేల రూపాయల మేర నష్టపోయారని చంద్రబాబు చెప్పారు. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తను పర్యటిస్తున్నందువల్లే సీఎం జగన్ కూడా తిరుగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిపై పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనాకు అధికారులెవరూ ఇంతవరకు రాలేదని వాపోయారు.
























Discussion about this post