ఈసారి కేరళలో కనీసం నాలుగు సీట్లలో గెలవాలని బీజేపీ బలంగా పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్తితుల్లో దేవభూమిలో పాగా వేయడానికి కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం దాదాపు ఐదేళ్లుగా స్కెచ్ వేసింది. కొన్ని పార్టీలను తమలో మెర్జ్ చేసుకున్న బీజేపీ, ప్రత్యర్ధులు ఊహించని విధంగా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ బాగా పెంచుకుంది.
2019 ఎన్నికల్లో కొద్దిగా బలం పెంచుకున్న కేరళ బీజేపీ యూనిట్, ఇప్పుటి ఎన్నికలను పూర్తిస్తాయిలో టార్గెట్ చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఐదేళ్ల నుంచీ భారీ స్కెచ్ అమలు చేస్తోంది. కేరళ బీజేపీని సంస్థాగతంగా గణనీయమైన మార్పులు తెచ్చిన ఆ పార్టీ పెద్దలు, ప్రత్యర్ధులకు ఊహించని విధంగా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేంద్ర మాజీ మంత్రి ఏ.కే. ఆంటోని కుమారుడు అనీల్ ఆంటోనీకి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. దీంతో క్రిస్టియన్ ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
కేరళలో మొత్తం 20 ఎంపీ సీట్లున్నాయి. 2019 ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా బీజేపీ గెలవలేదు. కానీ 13 శాతం ఓట్ బ్యాంక్ పదిలం చేసుకుంది. అంతేకాదు, తిరువనంతపురంలో రెండో స్థానంలో నిలిచిన కాషాయ పార్టీ, పట్నంమిట్ట, త్రిస్సూర్, కసరగోడ్, అట్టింగల్ సీట్లలో 25 శాతం ఓటింగ్ సొంతం చేసుకుంది. అలాగే నాలుగు సీట్లలో 15 శాతం, మరో తొమ్మిది సీట్లలో 10 శాతం ఓటింగ్ నమోదు చేసింది.
అనీల్ ఆంటోని ద్వారా క్రిస్టియన్ ఓట్లకు గాలం వేసిన బీజేపీ పెద్దలు, కేరళ జనపక్షం సెక్యులర్ పార్టీని తమలో కలిపేసుకుంది. ఈ పరిణామంతో కంగుతిన్న కాంగ్రెస్ పెద్దలకు మరో షాక్ ఇచ్చింది బీజేపీ. కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణు గోపాల్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ బీజేపీలో చేరారు. దీంతో మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్ధులను బరిలో దింపింది బీజేపీ. తిరువనంతపురం నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తుంటే, అట్టింగల్ నుంచి మరో కేంద్ర మంత్రి మురళీధరన్ బరిలో నిలిచారు. అలాగే త్రిస్సూర్ నుంచి మరోసారి బరిలో ఉన్నారు నటుడు సురేష్ గోపి. ఇక పట్నంతిట్ట నుంచి అనీల్ ఆంటోనీ సై అంటున్నారు. ఇక ఐదేళ్లుగా కేరళను టార్గెట్ చేసిన బీజేపీ, పాపలర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో హిందూ యువత ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అలాగే కసరగోడ్, తిరువనంతపురం హైవే పనులు దాదాపుగా పూర్తి చేసింది. అంతేకాదు, కొచ్చి మెట్రో, షిప్ యార్డ్ డెవలప్మెంట్ పనులను కూడా వేగంగా పూర్తి చేసింది. ఇక అలెప్పి బైపాస్ రోడ్, ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు స్మార్ట్ సిటీస్ పేరుతో కేరళలోని కొన్ని నగరాలకు భారీగా నిధులు మంజూరు చేసింది.
బీజేపీ దూకుడు నిర్ణయాలతో కేరళలోని లెఫ్ట్ డెమాక్రెటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమాక్రెటిక్ ఫ్రంట్ కంగారు పడుతున్నాయట. ఇదే సమయంలో రెండు కూటముల మధ్య సయోధ్య ఇప్పటికీ కుదరడం లేదు. ఓవైపు ఇండి కూటమిలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎం పార్టీలు, కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో సఖ్యతతో ఉండలేక పోతున్నాయి. ఎందుకంటే, కేరళ సీఎం పీఠం ఆ రెండు పార్టీల మధ్యే దోబూచలాడుతుంది. ఓసారి ఎల్డీఎఫ్, మరోసారి యూడీఎఫ్ పార్టీలు అధికారం చెలాయిస్తున్నాయి. ఇప్పటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు పొసగడం లేదు. ఈ పరిస్తితి బీజేపీ వ్యతిరేక ఓట్ల మధ్య చీలిక తేవడం ఖాయమంటున్నా రాజకీయ విశ్లేషకులు.
ఐదేళ్ల నుంచి భారీ స్కెచ్ అమలు
కేరళ బీజేపీలో గణనీయమైన మార్పులు
ప్రత్యర్ధులు ఊహించని ప్రయత్నాలు
అనీల్ ఆంటోనీకి పార్టీ రాష్ట్ర పగ్గాలు
క్రిస్టియన్ ఓట్లను క్యాష్ చేసుకునే ప్రయత్నం
కేరళలో మొత్తం 20 ఎంపీ సీట్లు
2019లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ
2019లో 13 శాతం ఓట్ బ్యాంక్
తిరువనంతపురంలో రెండో స్థానం
త్రిస్సూర్, పట్నంమిట్టలో 25% ఓట్ బ్యాంక్
కసరగోడ్, అట్టింగల్ సీట్లలో 25% ఓట్ బ్యాంక్
4 సీట్లలో 15 శాతం ఓట్ బ్యాంక్
9 సీట్లలో 10 శాతం ఓట్ బ్యాంక్
బీజేపీలో మెర్జ్ అయిన కేరళ జనపక్షం సెక్యులర్ పార్టీ
బీజేపీలో చేరిన మాజీ సీఎం కుమార్తె పద్మజ వేణుగోపాల్
తిరువనంతపురం నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ
అట్టింగల్ నుంచి కేంద్ర మంత్రి మురళీధరన్ పోటీ
త్రిస్సూర్ నుంచి సురేష్ గోపి పోటీ
పట్నంతిట్ట నుంచి అనీల్ ఆంటోనీ
పీఎఫ్ఐ మీద నిషేధం విధించిన కేంద్రం
హిందూ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం
పూర్తి అయిన కసరగోడ్, తిరువనంతపురం హైవే
పూర్తి అయిన కొచ్చి మెట్రో, షిప్ యార్డ్ పనులు
స్మార్ట్ సిటీస్ పేరుతో భారీగా నిధుల మంజూరు
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కంగారు పడుతున్నాయా?
ఇండి కూటమిలోనే సీపీఐ, సీపీఎం
లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మధ్య కుదరని సఖ్యత
బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలుస్తాయన్న విశ్లేషణ
Discussion about this post