పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో జరుపుతున్న తనిఖీలలో ఐదు కేజీల వెండి బయటపడింది. గోపి అనే ప్రయాణికుడి నుండి బిల్లులు లేకుండా తరలిస్తున్న సుమారు మూడు లక్షల విలువచేసే 5 కేజీల వెండిని స్వాధీనం చేసుకొని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మిర్యాలగూడ రైల్వే పోలీస్ అధికారులు చెప్పారు.
Discussion about this post