హైదరాబాద్ పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ఒక వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వృద్ధుడు ఉస్మానియా లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్ షిప్ లో చుట్టూ ప్రహరీ గోడ ఫ్లాట్ లోకి వృద్ధుడు వెళ్ళాడు. ఆ ప్లాట్ అహ్మద్ నజీర్ అడ్వకేట్ ది. అందులోకి హమీద్ హుస్సేన్ అనే వృద్ధుడు లోపలికి ఎలా వెళ్ళాడో తెలియదు. కానీ అక్కడ ఏదో వెదుకుతూ ఉండగా బ్లాస్ట్ అవ్వటం ప్రక్కనే ఉన్న మసీదు కిటికీ అద్దాలు కూడా పగిలి పోయాయి. పెద్ద ఎత్తున శబ్దం కావటం తో స్థానికులు వచ్చి చూడగా హమీద్ తీవ్రంగా గాయపడి ఉన్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Discussion about this post