బెంగళూరు వేదికగా మే 18న చెన్నై, బెంగళూరు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడింది.
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మహామహుల యుద్ధం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కోల్కత్తా నైట్‌రైడర్స్… రాజస్థాన్ మాత్రమే ప్లే ఆఫ్‌కు చేరగా…. మరో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్ కీలకంగా మారింది.
చెన్నైతో మ్యాచ్ లో విజయం ఆర్సీబీ జట్టుదేనంటున్నారు అభిమానులు. మే 18న మ్యాచ్ జరగడమే ఇందుకు కారణం. అంటే మే 18న ఇప్పటి వరకు ఆర్సీబీ 4 మ్యాచ్‌లు ఆడింది. 2013 లో మే 18న జరిగిన మ్యాచ్ లో CSKపై RCB గెలిచింది. 2014లో ఇదే తారీఖున CSK ని చిత్తు చేసింది. ఇక 2016లో మే 18 పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది. గతేడాది ఇదే తేదీన SRHను ఆర్సీబీ ఓడించింది. ఇప్పుడు కూడా మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో RCB తలపడనుంది. కాబట్టి ఈసారి కూడా విజయం ఆర్సీబీ జట్టుదేనన్న వాదనను అభిమానులు ముందుకు తెస్తున్నారు.
అయితే క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ప్లేఆఫ్‌కు ఏ జట్టు అర్హత సాధిస్తుందన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. బెంగళూరు టీముకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటింది. ఇందులో ఓడితే బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు సన్నగిల్లుతాయి. ఘన విజయం సాధిస్తే ముందడుగు వేసే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రోజంతా 73 శాతం, సాయంత్రం 6 గంటల సమయంలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదేగనుక జరిగి మ్యాచ్ రద్దయితే బెంగళూరు 13 పాయింట్లతో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమిస్తుంది. చెన్నై 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగితే చెన్నైపై బెంగళూరు 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో గెలవాలి. చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే చెన్నై నెట్ రన్‌రేట్‌ను బెంగళూరు అధిగమించి ప్లేఆఫ్స్‌కు చేరుతుంది.
Discussion about this post