ఇళ్లకు స్టిక్కర్లు అంటించి అదే రాష్ట్ర అభివృద్ధి అనే ఊహల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని విశాఖ పచ్చిమ ఎమ్మెల్యే పి. గణబాబు అన్నారు. మొన్నమొన్నటి వరకు ఎంతమంది కలిసినా ఏం చేయలేరని చెప్పే ఆయన ప్రస్తుతం సీఎంగా సంతోషంగా దిగిపోతానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఆయనలోని ఓటమి భయాన్ని బయట పెట్టిందన్నారు. ప్రజల నుంచి ఎక్కడ తిరుగుబాటు వస్తోందన్న భయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని గణబాబు అన్నారు.
నియోజకవర్గ పరిధి పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన సంపాదను సృష్టించలేక జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. నల్లధనాన్ని దాచుకోవడం కోసమే అలా మాట్లాడి ఉండొచ్చని గణబాబు అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలలో వైసీపీ పార్టీ పై పూర్తి అపనమ్మకం ఏర్పడిందని ఆయన అన్నారు.
Discussion about this post