గత కొద్ది రోజులుగా తెలంగాణలో చలి వణికిస్తోంది. జంట నగరాల్లో అయితే ఉదయం, రాత్రి వేళ్లల్లో… పిల్లలు, వృద్దులు గజగజా వణికిపోతున్నారు. చలి కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. చలికాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు చలి నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలని, వారిలో త్వరగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వెల్లడించారు.
వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. చిన్న పిల్లలు అంటు వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోదక శక్తి పెరగడానికి పరిశుభ్రతను పాటిస్తూ.. సరైన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి మందులను స్టోర్ చేసుకోని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే, తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిదన్నారు.
Discussion about this post