రష్యా- ఉత్తర కొరియా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ , కిమ్ జోంగ్ ఉన్ ల మిలటరీ సంబంధాలను బైడెన్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఉత్తరకొరియా రాజకీయ, పారిశ్రామిక కేంద్రమైన ప్యోంగ్యాంగ్ లోని న్యూక్లియర్ సామర్థ్యాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు తావిస్తోందని అమెరికాలోని ఆరుగురు సీనియర్ అధికారులు తెలిపారు. కొద్ది వారాల్లో పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించనున్నారు. దీంతో మిలటరీ టెక్నాలజీలో కొత్త డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉందని, అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకుంటోందని అమెరికా భయపడుతోంది. దీనిపై మరింత సమాచారం మీ కోసం..
దశాబ్దకాలంగా రెచ్చగొట్టే ధోరణి లో ఉత్తర కొరియా మిలటరీ చర్యలుంటున్నాయని.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర్లో ఉండగా, మరో ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నాడని అమెరికా నిఘా సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రజలు జోబైడెన్ ను ఎన్నుకోవాలా ? ట్రంప్ ను ఎన్నుకోవాలో ఆలోచించుకోవాలన్నారు. ఈ ఏడాది మొత్తం ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలతోనే ముందుకెళుతుందన్నారు. 2016లో రష్యా ప్రమేయంతోనే ట్రంప్ అధ్యక్షుడయ్యారన్నారు. 2022 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగించడంతో అమెరికా ఒత్తిడితో కూడిన సంబంధాలను రష్యాతో ఇప్పటికి కొనసాగిస్తోందన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ అక్టోబర్ సర్ ప్రైజ్ చూడాటానికి రెడీ గా ఉండాలన్నారు. మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలవనున్నానని ట్రంప్ అన్నారు.
2024 మంచి ఏడాదిగా ఉండబోదని ఆసియా- కొరియా ఇంటర్ నేషనల్ స్టడీస్ అండ్ స్ట్రాటజిక్ స్టడీ సీనియర్ వైస్ ప్రసిడెంట్ విక్టర్ ఛా తెలిపారు. ఈ ఏడాది రోలర్ కోస్టర్ లా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఉత్తర కొరియాను రష్యా రెచ్చగొడుతోందని అమెరిక నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ దేశానికి న్యూక్లియార్ సబ్ మెరైన్, బాలిస్టిక్ మిస్సైళ్ల టెక్నాలజీలను రష్యా అందచేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఐరోపా అంతా కలసి ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్న ఆయుధాల కంటే ఎక్కువగా ఉత్తర కొరియా ఫిరంగులతో సహా మరిన్ని ఆయుధాలను రష్యాకు పంపుతుందన్నారు. ఉత్తర కొరియా ఒక సబ్ మెరైన్ ను ప్రారంభించింది. అది సోవియట్ తయారు చేసిన మోడల్ లో ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఉత్తర కొరియా తనకు ఉన్న ఆయుధాల కంటే మరింత ఎక్కువ చేసి చెబుతోందని అమెరికా వెల్లడించింది.
Discussion about this post