యువత రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని, అభివృద్ధికే ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పిలుపునిచ్చారు. తొలిసారిగా ఓటు హక్కు పొందినవారి కోసం ధర్మసాగరం మదర్ నర్సింగ్ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోస్టర్లను ఆవిష్కరించారు.
నర్సీపట్నం జడ్పీటీసీ సుంకల రమణమ్మ, చింతకాయల రాజేష్గ, గవిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కు పొందిన యువకులు తప్పనిసరిగా ఓటు వేయాలని చెప్పారు. ఎవరి మాటలకూ ప్రభావితం కాకుండా సొంతంగా ఆలోచించి అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని కోరారు.
Discussion about this post