పార్లమెంట్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు . దాని కోసం సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. CISF ఉగ్రవాద నిరోధక భద్రత విభాగంలోని 3,300 మంది నిఘా నీడలో పార్లమెంట్ ఆవరణ ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు.
పార్లమెంట్‌పై దాడులు జరుగుతాయనే అనుమానంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. అందులో భాగంగా పార్లమెంట్ ఆవరణలో సమగ్ర భద్రతను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పజెప్పింది. ఆ అధికారులు ప్రస్తుతం రంగంలోకి దిగారు… మే 20 నుంచి అక్కడ సెక్యూరిటీ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి వరకు CRPF, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్, సెక్యూరిటీ స్టాఫ్లు మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తున్నారు… తాజాగా CISF వాళ్లు బాధ్యతలు తీసుకుంటున్నారు.
గతేడాది డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు… పార్లమెంట్లో అలజడి జరిగింది… ఆ ఘటన తీవ్ర కలకలం రేపింది.. దీంతో అక్కడున్న భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. ఆ దాడి తర్వాత పార్లమెంట్ ఆవరణలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తే బాగుటుందని కేంద్రం భావించింది. అందులో భాగంగా CISFకు గస్తీ బాధ్యతలను అప్పగించింది. డీఐజీ ర్యాంకు స్థాయి సీఆర్పీఎఫ్ అధికారి బిల్డింగ్‌లోని సెక్యూరిటీ పాయింట్లను CISFకు అప్పగించారు.
పార్లమెంటు కాంప్లెక్స్‌లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, డాగ్ స్క్వాడ్, వాచ్ టవర్ల దగ్గర CISF సిబ్బందిని నియమించారు. ఇప్పటికే వారికి సంబంధిత శిక్షణ అందజేశారు. విధ్వంసక కార్యకలాపాల కట్టడి తదితర విధులకు ప్రత్యేకంగా శిక్షణ పొందినవారిని రంగంలోకి దింపారు. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి.
పార్లమెంట్ దగ్గర CIS ఫోర్స్ ఉండటం చాలా మంచిదే… లాస్ట్ ఇయర్ జరిగిన ఘటనతో కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది… రాబోయే ప్రభుత్వం కూడా ఈ సెక్యూరిటీ ఫోర్స్‌ను కంటిన్యూ చెయ్యాలని మనము కోరుకుందాం…
Discussion about this post