ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ తలపెట్టిన జిల్లాల పర్యటనలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ భీమిలి సంగివలసలో జరిగే తొలి బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ నెల 27న జగన్ పాల్గొనే సభా ప్రాంగణాన్ని వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్ నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. బహిరంగ సభల్లో పాల్గొనడమే కాకుండా క్యాడర్ తో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Discussion about this post