మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు సీఎం హాజరయ్యారు. తొలుత రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో జిల్లా కేంద్రంలోని క్రీడల మైదానానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కారులో ఎంవీఎస్ మైదానానికి ర్యాలీగా చేరుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించలేదు. సొంత జిల్లా కావడంతో మహబూబ్‌నగర్ నుంచే ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Discussion about this post