అనకాపల్లి గాంధీనగర్ వెలమభవన్లో వెలమ కులస్తులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్.. తన స్వగ్రామం కడపలో సుమారు 5 కోట్ల రూపాయలతో వెలమ కమ్యూనిటీ ఏసీ భవనం భవనం నిర్మించమన్నారు. ఈ భవనం పేద ధనిక అన్ని సామాజిక వర్గాలకు వివిధ కార్యక్రమాలు చేసుకునేందుకు ఈ భవనం రూపొందించామని తెలిపారు. అదేవిధంగా అనకాపల్లిలో సుమారు 18 వేల వెలమ కులస్తులు నివసిస్తున్నారని, వారికి అన్ని విధాలుగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వెలమ భవన నిర్మాణాలకి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు.
Discussion about this post