ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పర్యటనలో భాగంగా మొదటిసారి మహబూబ్‌నగర్‌కి వెళ్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. పాలమూరు జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నీటిపారుదల, విద్యా, వైద్యం, పర్యాటకం మహిళా సాధికారతతో పాటు వివిధ రంగాలపై నిర్వహించే ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొంటారు.






















Discussion about this post