ఉద్యోగుల సమస్యలను మ్యానిఫెస్టో లో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కొనియాడారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు , సీపీఎస్ రద్దు , పెండింగ్ ఏరియర్స్ చెల్లింపు వంటి అంశాలు మ్యానిఫెస్టో లో పెట్టినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సీఎంను కలిసి ఆయన అభినందనలు తెలియ జేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా , నాంపల్లి లోని టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో ఉద్యోగులు కేక్ కట్ చేసి , బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ పాల్గొన్నారు.
Discussion about this post