ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ ప్రారంభమైంది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంతవాహనంలోనే జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను సీఎం రేవంత్, మంత్రులు స్వీకరించారు. ముందుగానే ప్రకటించడంతో ప్రజాదర్బార్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అక్కడి సిబ్బందికి ఫిర్యాదులు ఇచ్చారు. ఈ ఫిర్యాదులలో రకరకాల సమస్యలున్నాయి. సిబ్బంది అడిగిన సమాచారాన్నిఅందించారు. తమ సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Discussion about this post