సంగారెడ్డి జిల్లా చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు ఘటనపై సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఫైర్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, కలెక్టర్, ఎస్పీకి సూచించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ ఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్-1 పరిశ్రమలో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Discussion about this post