తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ సరికొత్త సంచలనానికి తెరలేపారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. తల్లులు, పసిపిల్లల కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన పథకాన్ని అనౌన్స్ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇవ్వబోతోంది విజయ్ ప్రభుత్వం! అవును, మీరు విన్నది నిజమే.. పుట్టిన ప్రతి బిడ్డకూ ఉచితంగా గోల్డ్ రింగ్! దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది.తమిళ సంస్కృతిలో మేనమామ (తాయ్ మామన్) పుట్టిన పిల్లలకు బంగారు కానుకలు ఇవ్వడం ఒక సాంప్రదాయం. ఇప్పుడు ఆ మేనమామ స్థానంలో స్వయంగా ప్రభుత్వమే నిలబడి, ఈ “తాయ్ మామన్ తంగ మోథిర తిట్టమ్” (మేనమామ బంగారు ఉంగరాల పథకం) ద్వారా పసిబిడ్డలను ఆశీర్వదించబోతోంది.ఈ క్రేజీ స్కీమ్‌ను సెప్టెంబర్ 15న మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ దిగ్గజం సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సీఎం విజయ్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
అయితే, ఈ పథకం జూన్ 22 అంటే సీఎం విజయ్ పుట్టినరోజు నుండి బ్యాక్ డేట్ (రెట్రోస్పెక్టివ్) తో వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 22 నుంచి తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన ప్రతి బిడ్డకూ ఈ వన్ గ్రామ్ గోల్డ్ రింగ్ దక్కనుంది. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచడానికే విజయ్ ఈ మాస్టర్ స్ట్రోక్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకు 1 గ్రాము బంగారు ఉంగరం!
- తమిళనాడులో ‘తాయ్ మామన్ గోల్డ్ రింగ్ స్కీమ్’ ఖరారు!
- సెప్టెంబర్ 15న మాజీ సీఎం అన్నాదురై జయంతి సందర్భంగా అధికారికంగా లాంచ్!
- జూన్ 22 సీఎం విజయ్ పుట్టినరోజు నుండి పుట్టిన పిల్లలందరికీ ఈ పథకం వర్తింపు!
- ఏటా ఏకంగా 755 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన విజయ్ ప్రభుత్వం!
Follow for more updates
