ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కండ్ల ముందు పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాగునీటి పేరుతో పంట పొలాలకు సాగునీరు ఇచ్చి లక్షలాది ఎకరాలను కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ లేదని.. ఉంటే నీరిచ్చి ఆదుకునేవారని చెప్పారు. కనీసం రెండు తడులకైనా నీరందిస్తే పంటలు చేతికొచ్చేవని అన్నారు.
Discussion about this post