ప్రపంచంలోని ప్రప్రధమ వాణిజ్య అంతరిక్ష విమానం త్వరలో సిద్దం కాబోతోంది. సియార్రా డ్రీమ్ ఛేసర్ DC-100 నాసాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ కు చేరుకుంది. ఈ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ISS కు ఇక్కడ చివరి పరీక్షలు జరుపుతారు. దీన్ని భూమి నుంచి అంతరిక్షంలోకి కార్గో లా ఉపయోగిస్తారు. దీని పొడవు 30 అడుగులు, వెడల్పు 15 అడుగులు ఉంది. ఇది 7 వేల పౌండ్ల ను అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. నాసా తెలిపిన ప్రకారం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చాక మార్పులు చేర్పులు చేసి దీనిని మళ్లీ ఉపయోగించవచ్చు. కనీసం 7 సార్లు దీనిని ఉపయోగించవచ్చని నాసా భావిస్తోంది. దీనిలో 7,800 పౌండ్ల ఫుడ్ , వాటర్ తోపాటు కక్ష్యలో తిరుగుతున్న లాబొరేటరీలో సైన్స్ ప్రయోగాలు కూడా చేయవచ్చని నాసా చెబుతోంది.
ప్రీ-లాంచ్ ప్రిపరేషన్‌లో ధ్వని, విద్యుదయస్కాంత జోక్యం, అనుకూలత పరీక్ష, విమానం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌పై ఓహియోలోని సండస్కీలోని నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ల్యాబ్ లో అన్ని పరీక్షలు నిర్వహించారు. లాంచ్ కి ముందు నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను పూర్తి చేస్తున్నారు. అయితే ప్రయాణ తేదీని మాత్రం ప్రకటించలేదు. అంతరిక్షంలోకి వెళ్లిన 45 రోజుల తర్వాత ఇది ఫ్లోరిడాకు చేరుతుంది. రానున్న రోజుల్లో ఈ టూరిజం 75 రోజులకు పొడిగించనున్నారు. 11,500 పౌండ్ల కార్గొని తీసుకెళతారు. సియర్రా స్పేస్ సెంటర్ ను కేవలం అంతరిక్ష టూరిస్టుల కోసమే ఏర్పాటు చేస్తున్నారు. Space X , అండ్ బ్లూ ఆరిజిన్ లు కూడా తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు.తద్వారా వ్యోమగాములను, పౌరులను అంతరిక్షంలోకి తీసుకెళ్ల గలవు.
Discussion about this post