ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18 నుంచి 24 వరకు స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు కొనసాగుతాయని దేవస్థానం ఈఓ రామచంద్రమోహన్ అన్నారు. 18న వైశాఖ శుద్ధ దశమిని పురస్కరించుకుని అనివేటి మండపంలో స్వామి వారిని పెండ్లి కుమారునిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా ఎదుర్కోలు నిర్వహిస్తామని, 19న వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి 9.30 నిమిషాలకు దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.
Discussion about this post