రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారిం చాలని కోరుతూ స్థానిక జూబ్లీ క్లబ్ నుండి పాత బస్టాండ్ వరకు విద్యార్థులతో PDSU విద్యార్ధి సంఘాలు భారీ ర్యాలీ చేశారు.ఈ సందర్భంగా pdsu నాయకులు మాట్లాడుతూ గత brs ప్రభుత్వం లాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల మొండివైఖరి చూపు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభి౦చాలని కోరారు . పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ , రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని పెరిగిన ధరలకు అనుగులంగా మెస్ , కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని కోరారు.మెడికల్, JNTU సబ్ క్యాంపస్, నర్సింగ్ కళాశాలలకు సత్వరమే భవన నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీ గా ఉన్నటీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయా న్నారు.గురుకులాలకు, వసతి గృహలకు సొంత భవనాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందించాలని డిమాండ్ చేశారు.
Discussion about this post