ఆధునిక టెక్నాలజీ పై ప్రజెంటేషన్లు
కొండాపూర్ కేఎల్ హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబల్డ్ టెక్నాలజీ పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డా. ఏ. రామ కృష్ణ, ఐఐటీ ప్రొఫెసర్లు డా. తరుణ్ రెడ్డి, డా, ధరవర్ రమేష్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మార్కెటింగ్ రంగాల్లో వస్తున్న ఆధునిక పోకడలు, అన్ని విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలా దూసుకు వెళుతోందన్న అంశాలతో 100 మంది ఔత్సాహికులు తమ ప్రజెంటేషన్ ను ప్రదర్శించి, వివరించారు.
AIతో ప్రపంచ రూపురేఖలు మారుతుండగా, ప్రతి బిజినెస్ విద్యార్థికి ఉపయోగపడేలా.. ప్రస్తుత కోర్సులతోపాటు మరిన్ని అడ్వాన్స్ డ్ కోర్సులను కొండాపూర్ కెఎల్ హెచ్ క్యాంపస్ అందిస్తోంది. అందులో భాగంగా ఎంబీఏ ఫైనాన్స్ , మార్కెటింగ్, టెక్నాలజీ విభాగాల్లో అధునాతన AI కోర్సులను విద్యార్థులకు అందిస్తోంది.
Discussion about this post