తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జోరు ఊపందుకుంది. అన్ని ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచాయి. కాగా.. ఈసారి ఎవరికివారే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఏకంగా అధికారంలోకి వచ్చేసిన తర్వాత ప్రమాణ స్వీకార సభ ఎప్పుడు, ఎక్కడా.. ఆ సభకు ఎవరెవరు వస్తున్నారనేది కూడా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం తమదేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018తో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలపడిందని చెప్తున్నారు. వాళ్ల నమ్మకానికి సర్వేలు కూడా బలం చేకూరుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే. అన్ని విషయాల్లో ఆచీ తూచీ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటుంది.
అధిష్ఠానం కూడా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించింది. మొన్న ఆరు గ్యారెంటీలు ప్రకటించేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మల్లిఖార్జున ఖర్గే కూడా వచ్చారు. ఇక రేపటి నుంచి ప్రారంభించబోయే ప్రచారానికి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా రానున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. వాళ్ళ రాకతో కాంగ్రెస్ ప్రచారం మరింత జోరు పెరుగుతుందని ఆ వర్గాలు అంటున్నాయి. అబ్దుల్ కలాం అన్నట్లు కలలు కనాలి దానికి 100 శాతం పనిచేయాలని పార్టీ వర్గాలకు రేవంత్ రెడ్డి తెలపారు. ఆయన కల తీరుతుందో లేదో డిసెంబర్ 3వరకు ఆగాలి మరి.
Discussion about this post