ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలను మే నెలలో నిర్వహించాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ …సీఈసీ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు పరీక్షలు జరిగే ఏప్రిల్ నెలలో కాకుండా మేలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో తాను పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన వల్లే మేనెలలో ఎన్నికలకు ఈసీ నిర్ణయం తీసుకుందని కేఏ పాల్ అన్నారు. చూశారా మన తెలుగుసత్తా అంటూ కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు.
Discussion about this post