ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, సీఎం జగన్ మాత్రం నా కల.. నా లక్ష్యం అంటూ సరికొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అదేస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది. గడిచిన పదేళ్లను చూస్తే ఏపీలో… వైఎస్ షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ కనిపిస్తుంది. విశాఖ ఉక్కు మైదానంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న న్యాయ సాధన సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగే ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభ ఏర్పాట్లకు సంబందించిన మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి ప్రతినిధి చందు అందిస్తారు.
Discussion about this post