ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ గల భారత దేశంలో ఎదురు చూసిన 18వ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
1962 తర్వాత ఒకే పార్టీ మూడుసార్లు విజేతగా నిలిచిన పార్టీగా బీజేపీ అవతరించింది. ఈసారి NDA కూటమికి INDIA కూటమి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో బీజేపీ ఆధ్వర్యంలోని NDA 400 సీట్లు కోరినా.. 293 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రపంచం నలుమూల నుంచి పీఎం మోడీకి, ఎన్డీఏకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. దీనిపై ఏ ఏ దేశాలు ఎలా ప్రతిస్పందించాయో తెలుసుకుందాం..
2019లో కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితమైంది. జోడో యాత్రతో రాహుల్ గాంధీ యావత్ భారత దేశం తిరిగి 99 స్థానాలను గెలుచుకోగా, INDIA కూటమి 234 సాధించింది. 2014,22019లో భారీ మెజారిటీ సాధించిన ప్రధాని మోడీ ప్రస్తుతం పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. గత ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన బీజేపీ 20 శాతం స్థానాలను కోల్పోయి 241కి పరిమితం అయ్యింది. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 కు కేవలం 20 సీట్లు మాత్రమే ఎక్కువ మాత్రమే వచ్చాయి. ఏడుగురు స్వతంత్రులు సహా ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. ప్రజలంతా బీజేపీ ప్రభుత్వానికి మోడీయే ప్రధాని అని అనుకుంటుండగా దాని అనుబంధ పార్టీ RSS మాత్రం గడ్కరీని పీఎం గా చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అమెరికాలోని వాషింగ్టన్ పోస్టు మోడీ విజయంపై స్పందిస్తూ మోడీ నాయకత్వానికి భారత ప్రజలు ఊహించని తిరస్కరణను ఇచ్చారని చావు తప్పి కన్ను లొట్టబోయిందని రాసింది. ఏదేమైనా మోడీ ప్రభావం తగ్గిపోతోందని చెప్పింది. ఇంగ్లాండు నుంచి వెలువడే గార్డియన్ పత్రిక మోడీ పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయారు అని రాసింది. బీజేపీ కి పరాజయం తప్పదని ఊహించారని రాయగా… ఆయన హిందూ జాతీయ వాద రాజకీయాలకు మూల్యం తగిలిందని గార్డియన్ కథనం ప్రారంభంలోనే తెలిపింది. బలమైన ప్రధానికి, ఆయన హిందూ జాతీయవాద రాజకీయాలకు వ్యతిరేకంగా దేశమంతటా ఎదురుదెబ్బలు తగిలాయని గార్డియన్ తన కథనం ప్రారంభంలోనే పేర్కొంది. ఈ ఫలితాలు PM మోడీకి “ఊహించని దెబ్బ”గా ఎలా నిలిచాయో వివరించింది. ఎన్నికల విరాళాల బాండ్స్ బయటికి రావడం , ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపడం ఈ పరిస్థితికి దారితీసిందని రాసింది.
మోడీ లోక్ సభ ఎన్నికల్లో ముందుకెళ్లినా మెజారిటీ తగ్గడం ఊహించని విషయం అని .. భారత దేశాన్ని ఎన్నో విధాలుగా రూపాంతరం చెందించిన ఆ పార్టీకి ఇది కళ్లు తెరవాల్సిన సమయంగా బీబీసీ ప్రకటించింది. అకస్మాత్తుగా మోడీ తన ప్రభావం కోల్పోవడం బాధాకరమని, దశాబ్దకాలం ప్రజ్వలించిన ఆయన ప్రతిభ తిరోగమనంలో పడిందని, మోడీ బ్రాండ్ చెదురుతుంది కాబట్టి జాగ్రత్త పడాలని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మోడీ వ్యక్తిగత ప్రతిష్ట మసకబారిందని జర్మన్ పత్రిక జర్మన్ వేవ్ తెలిపింది. బీజేపీ విజయోత్సవం కొంచెం మౌనంగా జరిగిందని పేర్కొంది.
Discussion about this post