తెలంగాణకు వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. ఈ నెల 6 వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్లో వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇటు ఏపీలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతల వివరాలు ఓ సారి చూద్ధాం….
హైదరాబాద్ 38°C
రామగుండం 38°C
కరీంనగర్ 38°C
విశాఖపట్నం 32°C
విజయవాడ 36°C
తిరుపతి 37°C
కడప 38°C
కర్నూలు 39°C
Discussion about this post