సిద్దిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. 50 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించామన్నారు. రాబోయేది కంప్యూటర్ యుగమే అని, విద్యార్థులందరూ కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు.
సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల మాదిరిగా బాలికల ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేస్తానని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఈ పాఠశాల విద్యార్థినిలు 10 కి 10 జీపీఏ సాధించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సిద్దిపేట కు గుర్తింపు ఉందని.. విద్యార్థులు బాగా చదువుకున్నప్పుడే మంచి గుర్తింపు, భవిష్యత్ ఉంటుందన్నారు.
Discussion about this post