భద్రాచలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో రమాదేవి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. ప్రధాన ఆలయంలోని హుండీలతో పాటు, ఉపాలయాలు, ఆలయ ఆవరణలోని హుండీల్లోని నగదును సిబ్బంది లెక్కించారు. సీతా సమేత రాములవారి సన్నిధిలోని చిత్రకూట మండపంలో లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.
భద్రాద్రి దేవస్థానంలో 56 రోజులకు స్వామివారికి కానుకల ద్వారా వచ్చిన హుండీ ఆదాయం రూ. 1,77,92,825/- , బంగారం 174 గ్రాములు, వెండి 1 కేజీ 248 గ్రాములు, అన్నదానం హుండీ రూ.3,88,100 /-వచ్చాయని, ఈ నగదును స్వామి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Discussion about this post