తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగర పాలక సంస్థ కార్మికులు చేపట్టిన ఆందోళనకు సిపీఎం, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. కార్మికుల డిమాండ్ మేరకు కార్పోరేషన్ కౌన్సిల్ తీర్మానం చేయడానికి అభ్యంతరం ఏమిటని నిలదీశారు. నగరపాలక సంస్థ వద్ద ఆందోళన చేపట్టిన కార్మికులపై పోలీసులు బలప్రయోగం చేయడం, నాయకులను అరెస్ట్ చేయడం తగదని అన్నారు. ఇదిలా ఉండగా కార్మికుల డిమాండ్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని మేయర్ స్రవంతి చెప్పారు.
Discussion about this post