అంగన్వాడీ టీచర్ల నిరవధిక సమ్మె
కనీస వేతనాల కోసం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. విశాఖ లోని జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సమ్మెకు సీఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదని ఆయన విమర్శించారు.
Discussion about this post