కృష్ణాజిల్లా కలెక్టర్ గా డీకే బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్ గా పని చేసిన రాజాబాబును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయగా ఆయన స్థానంలో బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న బాలాజీ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
నూతన కలెక్టర్ కు జేసీ గీతాంజలి శర్మ స్వాగతం పలికారు. జిల్లాలో నిస్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
Discussion about this post