మరో తెలుగు హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ మధ్య వరుణ్ తేజ్‌తోపాటు పలువురు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడీ లిస్టులోకి రానా తమ్ముడు అభిరామ్ చేరిపోయేందుకు రెడీ అయ్యాడు.ఈ పెళ్లి మూడు రోజుల పాటు జరగనుందని, శ్రీలంక దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని అంటున్నారు.
మూవీ మొఘల్ గా పేరుగాంచిన రామానాయుడు కుమారుడు నిర్మాత సురేశ్ బాబుకి ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో అబ్బాయి అభిరామ్ కూడా.. ‘అహింస’ అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈసినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడీ కుర్రాడే పెళ్లి చేసుకోబోతున్నాడు. వరసకు మరదలు అయ్యే అమ్మాయితో అభిరామ్ డిసెంబరు 6న ఏడడుగులు వేయబోతున్నాడు.
దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి పేరు ప్రత్యూష. ఆమెది కారంచేడు. ఇకపోతే అభిరామ్-ప్రత్యూష.. శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారట. దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తోంది. అతికొద్దిమంది మాత్రమే హాజరు కానున్న ఈ పెళ్లి వేడుక డిన్నర్ పార్టీతో మొదలవుతుంది.
మంగళవారం.. మెహందీ, డిన్నర్ ఉంటుంది. బుధవారం.. పెళ్లి కూతుర్ని చేయడం,అదే రోజు రాత్రి 8:50 గంటలకు అభిరామ్.. ప్రత్యూష మెడలో మూడు మూళ్లు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి పనుల్లో దగ్గుబాటి ఫ్యామిలీ బిజీగా ఉన్నారట.
Discussion about this post