అనంతపురం అర్బన్ లో టీడీపీ దూసుకుపోతుంది. టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకట ప్రసాద్ ప్రచారంలో దూకుడు పెంచారు. అనంతపురంలోని ఆజాద్ నగర్ లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దగ్గుబాటి వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో 40వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ శ్రీలక్ష్మి టీడీపీలో చేరారు. గత ముప్పై ఏళ్లుగా అనంతపురం నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని దగ్గుబాటి వెంకట ప్రసాద్ అన్నారు. ప్రజలకు కావలసిన కనీస అవసరాలను నిర్లక్ష్యం చేశారని తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
Discussion about this post