వైసీపి పాలనపై ప్రజల్లో రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వీరులపాడు మండల పరిధిలోని పెద్దాపురం గ్రామంలో దళితుడా మేలుకో..మన పల్లెకు సౌమ్య అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌమ్య మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ చూడని రాజకీయ పరిస్థితులు నేడు నందిగామలో చూస్తున్నామని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, అడ్డగోలుగా ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా చెలరేగి పోతుందని అన్నారు.
Discussion about this post