ఖమ్మంలో నకిలీ మిర్చి విత్తనాలు : ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణంలో స్టార్ ఫీల్డ్ మిర్చి విత్తనాలు తీసుకెళ్లగా ఈ విత్తనాలతో పంట దిగుబడి తగ్గిందని రైతులు తెలిపారు. తేజ రకం విత్తనాలని చెప్పి మోసం చేశారని వాపోయారు. స్టార్ ఫీల్డ్ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.
Discussion about this post