2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో టాప్ 10 లిస్టులో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటిగా నిలిచింది. తాజాగా వెలబడిన ఈ ర్యాంకింగ్స్ లో ఢిల్లీ విమానాశ్రయం టాప్ 10 లో పదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ జాబితాను పూర్తిగా ఒకసారి చూస్తే.. ఈ జాబితాలో అమెరికా దేశంలోని హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటిస్థానం దక్కించుకోగా.. దుబాయ్, డాలస్ విమానాశ్రయాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ వెలువడించింది.
Discussion about this post